Pawan kalyan: పవన్ మాట లేనిదే రోజు గడవటం లేదుగా.. అటు పాలిటిక్స్, ఇటు మూవీస్..
పవన్ కల్యాణ్ ఫోకస్ మొత్తం పాలన మీదే ఉన్నా, సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆయన మాట లేకుండా రోజు అసలు గడవదు. పవర్ స్టామినా అలా ఉంటుంది మరి.. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ఓజీ తో ట్రెండ్ అవుతున్నారు. ఇంతకీ ఓజీ అప్‌డేట్ ఏంటి అంటారా.? మాట్లాడుకుందాం వచ్చేయండి.! సుజీత్ డైరక్ట్ చేస్తున్న సినిమా ఓజీ. ఆ సినిమాను చూద్దురుగానీ అని పవర్‌స్టార్ జనాలను ఊరించారంటేనే, ఆ సబ్జెక్టు మీద ఆయన ఎంత మమకారం పెంచుకున్నారో అర్థం అవుతుంది.