
సినిమా విషయంలో ఎంత శ్రద్ధపెడుతున్నారో, పవన్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే కబుర్లు చెప్పడం మీద కూడా అంతే కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు కెప్టెన్ సుజీత్. ఇప్పుడు సెట్స్ మీదున్న ప్రాజెక్టుల్లో మరే డైరక్టర్ చేయని సాహసాలన్నిటినీ చేస్తున్నారు సుజీత్. అది కూడా మరింత స్మార్ట్ గా.

పవన్ కల్యాణ్ రీసెంట్ టైమ్స్ లో అత్యంత స్పీడ్‌గా చేసిన సినిమా బ్రో. మేనల్లుడు సాయితేజ్‌తో కలిసి చేశారు ఈ మూవీని. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మెప్పించలేకపోయినప్పటికీ, ప్రీ రిలీజ్ టైమ్‌లో మాత్రం క్రేజ్ ఓ రేజ్‌లో తెచ్చుకుంది.

ఆ ప్రీ రిలీజ్ క్రేజ్‌కి ఏ మాత్రం తీసిపోకుండా రెడీ అవుతోంది ఓజీ. సుజీత్ డైరక్షన్లో ఓజీ మూవీ చేస్తున్నారు పవన్ కల్యాణ్. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగుతుండటంతో, ఈ సినిమా మీద ఆయనకు కూడా ఎక్కువ ఇంట్రస్ట్ ఉంది. అందుకే ఇష్టంగా షూటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు.

ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓజీ టీమ్ ఓ గ్లింప్స్ విడుదల చేయడానికి రెడీ అవుతోందన్నది ఫ్యాన్స ని ఊరిస్తున్న విషయం. హరిహరవీరమల్లు టీమ్ నుంచి ఓ పోస్టర్ వస్తుందన్న టాక్ నడుస్తోంది.

ఉస్తాద్ భగత్‌సింగ్ యూనిట్ కూడా పోస్టర్‌కే ఫిక్స్ అవుతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం షూటింగ్ గ్యాప్‌లో ఉన్నారు పవన్ కల్యాణ్. ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్స్ లోకి త్వరలోనే వస్తారని కూడా ఆ మధ్య టీమ్ ప్రకటించింది.

అయితే సెప్టెంబర్‌లో ఎక్కువ రోజులను పవర్‌స్టార్ ఓజీకి అలాట్ చేశారన్నది లేటెస్ట్ న్యూస్. పవన్ కల్యాణ్‌ని అంతగా మెప్పించిన సబ్జెక్ట్, ప్యాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయితే, ఫ్యాన్స్ ఫెస్టివల్ మామూలుగా ఉండదంటున్నారు క్రిటిక్స్. అన్నీ వింటున్న సుజీత్... మై హూనా అంటూ సైలెంట్‌గా షెడ్యూల్స్ పనిలో బిజీఅవుతున్నారు.