సినిమా ఇండస్ట్రీలో నిలిచి నిదానంగా నీళ్లు తాగుతామంటే కుదరదు. ఎవ్రీ మినిట్ అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన ట్రెండ్‌లో ఎవ్రీ మినిట్ అప్‌డేట్స్ ఇస్తూ ఉండాలి. ఆ ఇచ్చే అప్‌డేట్స్ కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేదై ఉండాలి.
నిన్నమొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్న సాయిపల్లవి అమరన్‌తో ఇన్‌స్టంట్‌గా ఫామ్‌లోకి వచ్చేశారు. ఆ వెంటనే తండేల్ ప్రెస్‌మీట్‌కి హాజరు కావడం, బాలీవుడ్ నుంచి రామాయణ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ రావడంతో లేడీ పవర్‌స్టార్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది.
ఆమెలాగానే ఫ్రేమ్‌లోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చేశారు క్వీన్ అనుష్క. తెలుగులో ఘాటి గ్లింప్స్, మలయాళంలో కథనార్ కేరక్టర్ ఇంట్రడక్షన్‌తో క్వీన్ అనుష్క ఎలివేషన్ అద్భుతంగా జరిగింది.
రీసెంట్ ఇయర్స్ లో ది బెస్ట్ అనౌన్స్ మెంట్స్ తో బర్త్ డే జరుపుకున్నారు అనుష్క శెట్టి. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నప్పటికీ, వీళ్లిద్దరూ సడన్‌గా హల్‌చల్ చేయడంతో మిగిలిన వారి మీద ఫోకస్ చేస్తున్నారు జనాలు.
జిల్‌జిల్ జిల్ జిల్ జిగేల్ రాణి అంటూ తళుకులు చూపించిన పూజా హెగ్డే ఇప్పుడింత సైలెంట్ ఎందుకయ్యారు? ఇప్పుడు కూడా కాస్త యాక్టివ్ కాకపోతే ఇంకెప్పుడవుతారు అంటూ ఆరా తీస్తున్నారు ఆడియన్స్. పనిలో పనిగా శ్రీలీల ప్రాజెక్టుల మీద కూడా ఫోకస్ పెంచేశారు. 2025లో అయినా ఆమె నుంచి బ్యాక్ టు బ్యాక్ గుడ్‌న్యూస్‌లు వినాలని కోరుకుంటున్నారు.