
తెలుగు సినిమా గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు అక్కినేని నాగేశ్వరావు, ఎన్టీ రామారావు. నేడు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి. నాగేశ్వరరావు జయంతి వేడుకలను అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు కుటుంబసభ్యులు. ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ విగ్రహ ఆవిష్కారానికి టాలీవుడ్ కదిలి వచ్చింది. టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాగేశ్వరరావు విగ్రహానికి నివాళులు అర్పించారు.

అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాగార్జున చరణ్ ను ఆహ్వానించారు. రామ్ చరణ్ ఏఎన్ఆర్ విగ్రహానికి పూలు జల్లి నివాళులు అర్పించారు చరణ్.

నేచురల్ స్టార్ నాని నాగేశ్వరావు విగ్రహ ఆవిష్కారానికి హాజరయ్యారు. నాగేశ్వరావు విగ్రహానికి నివాళులు అర్పించారు నాని.

అలాగే భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఏఎన్ఆర్ విగ్రహా ఆవిష్కరణ జరిగింది. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఏ ఎన్ ఆర్ ఓ మహా వ్యక్తి, మహా నటుడు అన్నారు. ఆయనంటే నాకు ఎంతో అభిమానం అని అన్నారు.