
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరియమైంది పాయల్ రాజ్ పుత్. ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఫేమస్ అయ్యింది.

అయితే ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది పాయల్. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.

అయితే ఈ బ్యూటీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాకపోవడంతో పాయల్ కు స్టార్ హీరోస్ మూవీ ఛాన్స్ రావడం లేదు.

ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పోస్ట్ నెట్టింటే వైరలవుతుంది. సోల్ మేట్ అంటూ పాయల్ షేర్ చేసిన పోస్ట్ పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

నీకు ఇంకా సోల్ మేట్ కనిపించలేదని బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే పెళ్లి అయిన వాళ్లు కూడా ఇంకా వెతుక్కుంటూనే ఉన్నారు అంటూ పోస్ట్ చేసింది.