Payal Rajput: ‘నటీనటులకు అవి చాలా బాధను పంచుతాయి’.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. తొలి చిత్రంలోనే పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అదరగొట్టేసింది. ఈ సినిమాలో తన నటనతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి ఈ ముద్దుగుమ్మ నటిస్తోన్న సినిమా మంగళవారం. ఈ మూవీ శుక్రవారం అంటే నవంబర్ 17న విడుదల కాబోతుంది.