Hari Hara Veera Mallu: ఆలస్యమైనా.. అదిరిపోయే సెంటిమెంట్‌తో వస్తున్న వీరమల్లు

Edited By:

Updated on: Jun 23, 2025 | 9:37 PM

హరిహర వీరమల్లు వాయిదా పడితే పడింది గానీ.. ఇప్పుడు అనౌన్స్ చేసిన కొత్త డేట్ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు పవన్ అభిమానులు. దానికి కారణం కూడా లేకపోలేదు. తాజాగా ప్రకటించిన తేదీతో మెగా ఫ్యాన్స్‌కు బ్లాక్‌బస్టర్ అనుబంధాలున్నాయి. దాంతో పాటు మరో సెంటిమెంట్ ఊరిస్తుంది వాళ్లను. మరి ఏంటా రిలేషన్..? ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి..?

1 / 5
ఆఫ్టర్ ఏ గ్యాప్.. యామ్ బ్యాక్ అన్నట్లు కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మరోసారి ట్రెండ్ అవుతుంది. ఇలా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారో లేదో.. అలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఈ చిత్రం. పవన్ అంటే ఆ మాత్రం రచ్చ కామన్ కదా..? పైగా జులై 24 అంటే మెగా ఫ్యాన్స్‌కు పిచ్చి.. 23 ఏళ్ళ కింద ఇదేరోజు ఇంద్ర సినిమా విడుదలైంది.

2 / 5
చిరంజీవి అభిమానులు జులై 24ని ఎప్పటికీ మరిచిపోలేరు. ఆయన కెరీర్ కాస్త డౌన్‌లో ఉన్నపుడు 2002, జులై 24న వచ్చిన ఇంద్ర రికార్డులు తిరగరాసింది. ఇప్పుడీ బ్లాక్‌బస్టర్ డేట్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్.

3 / 5
23 ఏళ్ళ తర్వాత అదేరోజు హరిహర వీరమల్లుతో రాబోతున్నారు పవర్ స్టార్. ఇంద్ర ఒక్కటే కాదు.. పవన్ ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీ తొలిప్రేమ విడుదలైంది కూడా జులై 24నే. 1998 జులై 24న తొలిప్రేమ విడుదలైంది.

4 / 5
ఈ తేదీ మాత్రమే కాదు.. జులై నెల అంతా మెగా హీరోలకు బాగా కలిసొచ్చింది. 1999 జులై 15న విడుదలైన తమ్ముడు బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పవన్ మార్కెట్‌ను మరింత పెంచేసిన సినిమా ఇది. అంతేకాదు.. రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ మగధీర సినిమా విడుదలైంది 2009 జులై 31న.

5 / 5
వరుణ్ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఫిదా కూడా 2017, జులై 21నే విడుదలైంది. జులైలో వచ్చిన ప్రతీసారి దాదాపు విజయాలు అందుకున్నారు మెగా హీరోలు. మధ్య మధ్యలో శంకర్ దాదా జిందాబాద్, బ్రో లాంటి సినిమాలు నిరాశ పరిచినా.. 90 శాతం ఈ నెల్లో వచ్చిన సినిమాలన్నీ సక్సెస్సే. అందుకే హరిహర వీరమల్లు కూడా సంచలనం సృష్టించడం అని నమ్ముతున్నారు ఫ్యాన్స్.