Hari Hara Veeramallu: నన్ను నమ్మిన నిర్మాతకు నేను అండగా ఉంటాను.. పవన్ కళ్యాణ్..

Updated on: Jul 21, 2025 | 2:31 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు.

1 / 5
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రంలో  ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ఇందులో నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

2 / 5
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "మీడియా మిత్రులతో రాజకీయాల పరంగా చర్చించాను కానీ, ఇలా ఒక సినిమా కోసం పెద్దగా మాట్లాడలేదు. సినిమాకి సంబంధించి మాట్లాడటానికి నేను మొహమాటపడతాను. సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప.. ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను అనుకోకుండా నటుడిని, సాంకేతిక నిపుణుడిని అయ్యాను. సినిమా గురించి మీడియాతో మాట్లాడకపోవడానికి నాకు పొగరో, అహంకారమో కారణం కాదు. సినిమా గురించి చెప్పుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది.

3 / 5

4 / 5
నేను సినిమాల్లోకి రాకముందు ఎ.ఎం. రత్నం గారి లాంటి వ్యక్తి నా నిర్మాత అయితే బాగుండు అనుకునేవాడిని. ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. తమిళ సినిమాలను తెలుగులో విడుదల చేసి, స్ట్రయిట్ సినిమాల స్థాయిలో ఆడించి సత్తా చూపించిన వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. క్రియేటివ్ గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. ఏం చేసినా, ఎన్ని ఎదురైనా సినిమా బాగా రావాలని అనుకుంటాం. ఈ సినిమాకి ప్రత్యేకించి ఎ.ఎం. రత్నం గారి తపన చూశాను.

5 / 5
ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోయి.. దర్శకత్వానికి, క్రియేటివ్ పార్ట్ కి దూరమైన తర్వాత.. నా ప్రధాన దృష్టి రాజకీయాలపై ఉన్న సమయంలో.. నా దగ్గరకు వచ్చి మళ్ళీ మీరు సినిమా చేయాలని అడిగినప్పుడు నా బెస్ట్ ఇచ్చాను నేను. ప్రస్తుతం నేను టైం ఇవ్వలేను. అలాంటిది నేను ఒక్క క్లైమాక్స్ కే దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మే నెలలో మండుటెండలో షూట్ చేశాము. నేను ఎప్పుడో దేశ విదేశాల్లో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు నాకు ఈ సినిమాకి పనికొచ్చాయి. కొరియోగ్రాఫర్స్ తో కూర్చొని క్లైమాక్స్ ను ప్రత్యేకంగా రూపొందించాము" అని అన్నారు.