పాన్ ఇండియా ట్రెండ్‌లో కొత్త ట్విస్ట్‌.. ఆ విషయాన్ని లైట్ తీసుకుంటున్న మేకర్స్

| Edited By: Phani CH

Oct 31, 2024 | 9:55 PM

పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన కొత్తలో సినిమా మేకింగ్ కంటే ప్రమోషన్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు మేకర్స్‌. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. స్టార్ ఇమేజ్‌, కాంబినేషన్స్ క్రేజ్‌తో ప్రమోషన్‌ చేయకుండానే సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తోంది. దీంతో ప్రమోషన్స్‌ను లైట్ తీసుకుంటున్నారు మేకర్స్‌. బాహుబలి టైమ్‌లో కాళ్లకు చక్రాలు కట్టుకొని దేశమంతా తిరిగిన ప్రభాస్‌, రీసెంట్ టైమ్స్‌లో తన సినిమాల ప్రమోషన్స్‌ అస్సలు పట్టించుకోవటం లేదు.

1 / 5
ఇండియన్ సినిమాకు 1000 కోట్ల కలెక్షన్లు పరిచయం చేసిందే తెలుగు ఇండస్ట్రీ. బాహుబలి 2తో తొలిసారి 2017లో ఈ మార్క్ చేరుకుంది టాలీవుడ్.

2 / 5
బాహుబలి టైమ్‌లో కాళ్లకు చక్రాలు కట్టుకొని దేశమంతా తిరిగిన ప్రభాస్‌, రీసెంట్ టైమ్స్‌లో తన సినిమాల ప్రమోషన్స్‌ అస్సలు పట్టించుకోవటం లేదు. జస్ట్ డార్లింగ్ కటౌట్‌ చూసి కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి, మేకర్స్‌ కూడా పబ్లిసిటీ గురించి అస్సలు ఆలోచించటం లేదు.

3 / 5
తాజాగా పార్ట్ 2కు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కల్కి సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు ఇండియన్ సూపర్‌ స్టార్ ప్రభాస్‌. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా డార్లింగ్ కెరీర్‌లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది.

4 / 5
ట్రిపులార్‌ కోసం దేశ విదేశాలు చుట్టేసిన తారక్ కూడా దేవర విషయంలో ప్రమోషన్స్‌కు దూరంగానే ఉన్నారు. తెలుగు స్టేట్స్‌లో ఒక ఈవెంట్ ప్లాన్ చేసినా వర్కవుట్ కాలేదు. ఆ తరువాత మళ్లీ గ్రాండ్‌ ఈవెంట్‌ చేసే ప్రయత్నం చేయలేదు. అయినా దేవర కూడా బిగ్ హిట్ అయ్యింది.

5 / 5
పబ్లిసిటీ చేయకుండానే పాన్ ఇండియా సినిమాలు సూపర్ హిట్ అవుతుండటంతో అప్‌కమింగ్ సినిమాల విషయంలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న పుష్ప 2, గేమ్ చేంజర్‌ టీమ్స్‌ కూడా మేజర్‌ ఈవెంట్స్‌ లేకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి నిజంగానే బన్నీ, చరణ్ ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తారా..? లేక కొత్త ట్రెండ్ సెట్ చేస్తారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.