3 / 5
30 కోట్లున్న హీరోపై 30 కోట్ల బడ్జెట్ పెట్టడం రిస్క్ అనిపించదు.. కానీ 60 కోట్లు పెడితే మాత్రం కచ్చితంగా రిస్కే.. ఇంకా చెప్పాలంటే చీకట్లో బాణం వేయడమే. తగిలితే హ్యాపీనే.. కానీ మిస్సైతే మాత్రం నష్టాలు ఎంత భారీగా ఉంటాయో ఏజెంట్, శాకుంతలం, రావణాసుర లాంటి సినిమాలే చూపిస్తాయి. కానీ హిట్టైనపుడు దసరా లాంటి విజయాలు కూడా వచ్చాయి.