
ప్రముఖ కన్నడ నటి నిక్కీ గల్రానీ తన పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఆమెకిప్పుడు 31 ఏళ్లు. ఈ ఏడాది తన భర్త ఆది పినిశెట్టితో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకొంది నిక్కీ.

నిక్కీ, ఆది పినిశెట్టి 2022 మేలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత నిక్కీకి ఇదే మొదటి పుట్టినరోజు. అందుకే పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు హీరో.

నిక్కీ, ఆదిలది ప్రేమ వివాహం. విదేశాల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలికిన వీరు ఇప్పుడు వెకేషన్ మూడ్‌లో ఉన్నారు. ఇప్పుడు నిక్కీ పుట్టిన రోజు కూడా రావడంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

నిక్కీ- ఆది దంపతులు తల్లిదండ్రులు కానున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఖండించింది నిక్కీ.

హీరోగా, విలన్‌గా ఆది పినిశెట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఇక నిక్కీ కూడా పలు తెలుగు సినిమాల్లో నటించింది.