Neha Shetty: రాధిక అక్కా మళ్లీ వచ్చిందిరోయ్.. టిల్లన్నకు షాకిచ్చిన నేహాశెట్టి..
సిద్ధూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో నేహా శెట్టి కథానాయికగా నటించింది. ఈ మూవీలో సిద్ధూ టిల్లు పాత్రలో కనిపించగా.. నేహా రాధిక పాత్రలో నటించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన డీజే టిల్లు చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీసుకువచ్చారు. అదే టిల్లు స్వ్కేర్. కానీ ఇందులో నేహా శెట్టికి బదులుగా అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది.