
తొలి ఎపిసోడ్‌లోనే కొత్త సీజన్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు. బాలయ్య మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఆడియన్స్ చేత కంటతడి పెట్టించే ఎమోషనల్ ఇన్సిడెంట్స్‌కు సంబంధించిన విషయాల గురించి కూడా చర్చించారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఎనౌన్స్‌మెంట్ ప్రోమోలో ఈ సారి ప్రశ్నలే ఘాటు మరింత పెరుగుతుందన్న నందమూరి హీరో, తొలి ఎపిసోడ్‌లోనే ఆ ఘాటు చూపించబోతున్నారు.

భార్యతో కలిసి బాబు చూసిన రొమాంటిక్ సినిమా ఏంటి? బాబు ఇంట్లో బాస్ లేడీ ఎవరు? మనవడి ప్రశ్నకు బాబు ఇచ్చిన సమాధానం ఏంటి.?

ఇప్పటిదాకా బాలయ్యతో చాలా సార్లు మాట్లాడినా, ఇంత సుదీర్ఘంగా ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. తెల్లారుజామున 3.30కి నిద్రలేచే బాలయ్య, అంత ఎనర్జిటిక్‌గా ఎలా ఉండగలుగుతున్నారోనని ఆశ్చర్యపోయానన్నారు.

ఇలా ఫుల్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ చేత వెయిట్ చేయించే హింట్స్ ప్రోమోలో చాలానే ఉన్నాయి. అన్‌స్టాపబుల్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ ఈ శుక్రవారం రాత్రి 8.30 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది.