
జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నయన తార నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా అన్నపూరణి. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యావరేజిగా నిలిచింది. సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే ఈ సినిమా కంటెంట్ విషయంలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.

ఎంతలా అంటే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నయన తార అన్న పూరణి సినిమాను తమ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నుంచే తీసేసింది.

ఈ సినిమాలోని కంటెంట్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని చాలా చోట్ల కొందరు నిరసనకు దిగారు. సినిమాను బ్యాన్ చేయాలన్నారు.

తాజాగా అన్నపూరణి సినిమా వివాదంపై స్పందించింది నయన తార. సమాజంలోని అసమానతలను అధిగమించి సక్సెస్ అయ్యే కథా పాత్రల్లో నటించడం తన బాధ్యత అని పేర్కొంది.

తాను మహిళల గొంతుగా ప్రతిబింబించాలని, అందుకోసం సినిమాలను కూడా ఒక మాధ్యమంగా చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చిందీ లేడీ సూపర్ స్టార్.