
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో త్రిష, ఛార్మీ, నయనతార సైతం. ఇప్పుడు ఛార్మీ సినిమాల్లో నటించకుండా నిర్మాణ రంగంలో రాణిస్తుంది. కానీ దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న హీరోయిన్స్ నయనతార, త్రిష.

ప్రస్తుతం వీరిద్దరు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవలే సంక్రాంతి పండక్కి మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో హిట్టు అందుకుంది నయన్. మరోవైపు తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది త్రిష. వీరిద్దరు రీయూనియన్ అయ్యారు.

నయనతార, నికిషా పటేల్, ఛార్మీ, త్రిష రీయూనియన్ అయినట్లు తెలుస్తోంది. దుబాయ్ లో వీరంతా కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఛార్మీ, నికీషా పటేల్, త్రిష కలిసి తీసుకున్న ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు త్రిష, నయన్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని అందంతో నయన్, త్రిష కట్టిపడేస్తున్నారు. సముద్రం మధ్యలో వీరిద్దరు తీసుకున్న ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో వయసు పెరిగినా తగ్గని అందంతో హీరోయిన్స్ లుక్స్, ఫిట్నెస్ నెటిజన్లకు ఆశ్చర్యపరుస్తున్నారు.

ప్రస్తుతం నయనతార, త్రిష ఇద్దరు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది త్రిష. ఇటీవలే చిరుతో కలిసి హిట్టు అందుకుంది నయనతార.