
కళ్లు మూసినా, కళ్లు తెరిచినా నయనతారకి, అనన్య పాండేకి ఒక్కరే డైరక్టర్ కళ్ల ముందు మెదులుతున్నారట. ఆయన కెప్టెన్సీలో ఒక్క మూవీ చేసినా చాలని అంటున్నారు అనన్య.

అదే పనిలోనే ఉన్నా, త్వరలోనే కంప్లీట్ చేసేస్తా అంటున్నారు నయన్. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరో గుర్తుపట్టగలిగారా? లేదా... అయితే చూసేద్దాం రండి.

ఒక్కో జోనర్ సినిమాలను ఒక్కో డైరక్టర్ ఎక్సలెంట్‌గా డీల్ చేస్తారు. అలా సబ్జెక్టులను హ్యాండిల్ చేయడం సంగతేమోగానీ, హీరోయిన్ల మనసులు కొల్లగొట్టిన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నారు సంజయ్‌లీలా భన్సాలీ. పద్మావత్‌లో దీపిక పదుకోన్ అయితేనేం, గంగూభాయ్‌లో ఆలియాభట్ అయితేనేం భన్సాలీ సాబ్‌కి మేం ఫ్యాన్స్ అనేస్తున్నారు.

మీరందరికీ భన్సాలీ డైరక్షన్ ఎలా ఉంటుందో తెలుసు. కానీ నేను అతి త్వరలో ఆయన సెట్స్ కి వెళ్తానని అంటున్నారు నయనతార. రణ్‌వీర్ సింగ్, ఆలియా జంటగా నటించబోయే బైజూ బవ్రా సినిమాలో నయనతార కీ రోల్ చేయబోతున్నారు. త్వరలోనే నయన్ ఈ సెట్స్ కి వెళ్తారని టాక్.

నియర్లందరూ పోటీలో నుంచి పక్కకు తప్పుకుంటే, నెక్స్ట్ ఛాన్స్ నాకేనంటున్నారు అనన్య పాండే. కెరీర్లో ఒకే ఒక్కసారైనా భన్సాలీ హీరోయిన్ అనిపించుకోవాలన్నది మిస్ పాండే డ్రీమ్ అట. అందుకోసం డ్యాన్సులు, యాక్టింగులు.... ఇంకేం కావాలన్నా నేర్చుకోవడానికి నేను రెడీ అంటున్నారు లైగర్ బ్యూటీ అనన్య.