
అతన్ని మట్టుబెట్టడం కోసం శ్రీకృష్ణుడు సత్యభామను తోడుగా తీసుకుని రంగంలోకి దూకుతాడు.. ఇదీ కాన్సెప్ట్. ఇక్కడ శ్రీకృష్ణుడు నాని అయితే, నరకాసురుడు ఎస్.జె.సూర్య.. ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో టీజర్ మొత్తం హిందీలో సాగింది.

రీసెంట్‌గా చూసిన ఇండియన్ 2, ఇప్పుడు సెట్స్ మీదున్న గేమ్ చేంజర్, ఇండియన్ 3లోనే కాదు.. పెద్ద సినిమాలన్నిటిలోనూ కనిపిస్తున్నారు ఎస్.జె.సూర్య. మోస్ట్ కాస్ట్ లీ, స్టైలిష్ విలన్ ఆఫ్ సౌత్ సినిమాగా పేరు తెచ్చుకుంటున్నారు.

మిడ్ రేంజ్ సినిమాలు హిట్టైనపుడు లాభాలు భారీగానే ఉంటాయి. దానికి గీత గోవిందం, హనుమాన్ లాంటి సినిమాలే నిదర్శనం. హనుమాన్ ఏకంగా 125 కోట్ల లాభం తీసుకొస్తే.. గీత గోవిందం ఆరేళ్ళ కిందే 50 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. కానీ మార్కెట్‌ను మించి ఖర్చు పెడితే.. ఏజెంట్, శాకుంతలం, రావణాసుర లాంటి షాకులు కూడా తప్పవు.

ఆగస్టు 29న నేచురల్‌స్టార్‌లో చూసేయండి అని హింట్ ఇచ్చేశారు మేకర్స్. నా అనుకుంటే కొందరికి కోపం రావడాన్ని చూసే ఉంటాం.. కానీ నేచురల్ స్టార్‌కి కోపం వస్తే ఆ సమస్యను అతను నా అనుకున్నట్టే.. ఇదీ సరిపోదా శనివారం స్పెషల్ థీమ్.

నాగ చైతన్య తండేల్ బడ్జెట్ 75 కోట్లు దాటిందని స్వయంగా బన్నీ వాస్ తెలిపారు. కార్తికేయ 2తో చందూ మొండేటికి పాన్ ఇండియన్ మార్కెట్ వచ్చింది కాబట్టి గీతా ఆర్ట్స్ 2 బడ్జెట్‌పై టెన్షన్ పడట్లేదు. ఇక సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ సినిమా కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎంత మార్కెట్ ఉన్నా.. నిర్మాతలు బడ్జెట్ విషయంలో మరోసారి ఆలోచించుకోవడం మంచిదేమో..!