ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం అస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఆ క్రమంలోనే ఆ దేశ పార్లమెంట్ భవనాన్ని ఈ బృందం సందర్శించింది.
ఈ ప్రతినిధుల బృందంలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి, ఆయన రెండో కుమార్తె తేజస్విణి ఉన్నారు.
ప్రతినిధుల బృందంతో పాటు టీడీపీ జాతీయ ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు.
ఇక ఈ బృంధంతో ఎన్ఆర్ఐ టీడీపీ ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం కూడా కలిసి సందడి చేశారు.
ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.