ఇన్ని పనులనూ ఇలా ఎలా చేయగలుగుతున్నారన్ని ఆశ్చర్యపోతున్నారు. ఆల్రెడీ అన్‌స్టాపబుల్ నయా సీజన్‌తో దూసుకుపోతున్నారు బాలయ్య. సంక్రాంతి రిలీజుల రేసులో ఉంది డాకు మహరాజ్.
ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అని మళ్లీ మళ్లీ ప్రూవ్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. సిక్స్ టీ ప్లస్ ఏజ్‌లో సెల్ఫ్ రూల్స్ క్రియేట్ చేసి, వాటికి తగ్గట్టు తన టీమ్‌ని రూల్ చేసే అవకాశం ఉన్నా... తీసుకోవడం లేదు ఆయన.
బాబీ డైరక్ట్ చేసిన ఈ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి నందమూరి సర్కిల్స్ లో. ఎన్నికల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైంది కానీ, లేకపోతే 2024లోనే సందడి చేయాల్సింది డాకు మహరాజ్.
కెరీర్‌లోనే పీక్ ఫామ్‌లో ఉన్నారాయన. అన్నింటికీ మించి బాలయ్యకు బాగా కలిసొచ్చిన సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ప్రధానంగా మూడు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.
సినిమా మీద అద్భుతమైన హోప్స్ ఉన్నాయని చెప్పేశారు బాలయ్య. దానికి తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్‌ని కూడా ప్లానింగ్‌గా చేసుకున్నారు బోయపాటి. అఖండ2తో ప్యాన్ ఇండియా రేంజ్‌లో ప్రూవ్ చేసుకోవాలన్నది బోయపాటి ఐడియా.