మనం అడిగింది పులిహోరే.. కానీ వాళ్లు వడ్డించింది మాత్రం బిరియానీ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ అభిమానులు. మహరాజ్.. డాకు మహరాజ్ అంటూ టైటిల్‌ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటు్నారు. ఇంతకీ డాకు మహరాజ్ టీజర్ మీరు చూశారా? ఇంకో సారి చూసేద్దాం పదండి...
ఈ కథ వెలుగులు పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ.. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది.. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్ని వణికించిన మహారాజుది.. అంటూ సినిమా మీద హైప్ పెంచింది ఎన్బీకే 109 టీజర్.
టీజర్‌తోనే అమాంతం హైప్ తెచ్చిన ఈ సినిమాకు డాకు మహరాజ్ అనే టైటిల్ కూడా యమాగా కుదిరిందని ఖుషీ అవుతున్నారు జనాలు. గుర్తుపట్టావా... డాకు మహరాజ్ అని బాలకృష్ణ చెప్పే డైటాల్‌కి ఈలలు పడుతున్నాయి. విజువల్స్ నెక్స్ట్ రేంజ్ అంటూ మెచ్చుకుంటున్నారు జనాలు.
జస్ట్ టైటిల్, టీజర్ ఇచ్చి కామ్‌గా ఉండలేదు మేకర్స్. ఇప్పటిదాకా సంక్రాంతికి వస్తున్నామనే చెప్పేవారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందని చెప్పేశారు.
భగవంత్ కేసరి తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇందులో బాలయ్య కేరక్టర్ మూడు కోణాల్లో ఉంటుందని సమాచారం. ఆయన లుక్స్ గురించి కూడా ఆసక్తికరమైన చర్చ మొదలైంది.