
నాగార్జున పూర్తిగా మారిపోయినట్లేనా..? ఇకపై హీరోగా కనిపించడా..? ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. అయితే అలాంటిదేం లేదని తేల్చేసారు నాగ్. త్వరలోనే ఈయన 100వ సినిమా స్టార్ట్ కానుంది.

దీనికి దర్శకుడు కూడా ఖరారయ్యారు. ముందు నుంచి వినిపించిన తమిళ దర్శకుడు కార్తిక్ పేరునే కన్ఫర్మ్ చేసారు ఈ సీనియర్ హీరో.100వ సినిమాను త్వరలోనే మొదలు పెడతానంటూ నాగ్ చెప్పడంతో గాల్లో తేలిపోతున్నారు అక్కినేని అభిమానులు.

హీరోగానే కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ బిజీగానే ఉన్నారీయన. అంతేకాదు కథ నచ్చితే విలన్‌గా కూడా నటించడానికి ఓకే అనేస్తున్నారు నాగ్. ఫ్యాన్స్‌కు కాస్త కష్టంగా ఉన్నా.. నెగిటివ్ రోల్స్ వైపు అడుగులేస్తున్నారు నాగార్జున. ఈ మార్పు మంచికే అంటున్నారాయన.

కూలీ సినిమాలో నాగార్జున చేస్తున్నది నెగిటివ్ క్యారెక్టరే.. అది ఆయనే చెప్పారు కూడా. మరోవైపు కుబేరాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలోనే కనిపించారు నాగ్. త్వరలోనే బ్రహ్మాస్త్ర 2తో పాటు మరో రెండు సినిమాలు చేయనున్నారు.

ఇమ్మీడియట్‌గా మాత్రం 100వ సినిమాను మొదలుపెట్టబోతున్నారు నాగార్జున. మొత్తానికి ఒకప్పట్లా వేగంగా కాకుండా.. చాలా సెలెక్టివ్‌గా వెళ్లాలని ఫిక్సైపోయారు ఈ సీనియర్ హీరో.