
ప్రజెంట్ టాలీవుడ్‌లో టాప్ మ్యూజీషియన్స్ అంటే ముందు తమన్, దేవీ శ్రీ ప్రసాద్ పేర్లే వినిపిస్తాయి. ఈ మధ్య మ్యూజికల్ లవర్స్‌ను మెప్పించటంలో తడబడిన ఈ ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అప్ కమింగ్ సినిమాల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రజెంట్ వీళ్ల కిట్టీలో ఉన్న సినిమాలు మ్యూజిక్ ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న దేవీ శ్రీ ప్రసాద్... ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ ఫామ్ చూపించలేకపోతున్నారు. ముఖ్యంగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుడటంతో రేసులో కాస్త వెనకబడ్డారు. సినిమాల మధ్య గ్యాప్ ఉన్నా దేవీ మార్క్ బీట్స్ మాత్రం ఆడియన్స్‌కు బాగానే కనెక్ట్ అవుతున్నాయి.

పుష్ప 2 అప్‌డేట్స్‌తో దేవీ శ్రీ ప్రసాద్ పేరు గట్టిగానే ట్రెండ్ అయ్యింది. తాజాగా కంగువ నుంచి వచ్చిన సెకండ్ సాంగ్ ఒక్కసారిగా లెక్కలు మార్చేసింది. ఈ పాట ఇన్‌స్టాంట్‌గా వైరల్ కావటంతో సౌత్ సర్కిల్స్‌లో మరోసారి దేవీ పేరు గట్టిగా వినిపిస్తోంది.

పరభాషా సంగీత దర్శకుల జోరు పెరగటంతో తమన్ కూడా స్లో అయ్యారు. దీంతో సాలిడ్ హిట్ కోసం గట్టిగా కష్టపడుతున్నారు. అప్ కమింగ్ సినిమాలతో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు కష్టాపడుతున్నారు. తమన్ లైనప్‌లో ఉన్న సినిమాలు చూస్తూ ఆ రేంజ్ హిట్ అతి త్వరలో రాబోతుందనిపిస్తోంది.

గేమ్ చేంజర్‌తో పాటు ది రాజాసాబ్, ఓజీ, అఖండ 2 లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తమన్ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ సినిమాల్లో తన బెస్ట్ ఇచ్చేందకు కష్టపడుతున్నారు తమన్. ఇలా ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ బిగ్ ప్రాజెక్ట్స్‌తో రెడీ అవుతుండటంతో సిల్వర్ స్క్రీన్ మీద మ్యూజిక్ వార్‌కు సంబంధించి టాలీవుడ్‌లో డిస్కషన్ మొదలైంది.