
సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మృణాల్ ఠాకూర్. ఈసినిమాలో సీతమహాలక్ష్మి పాత్రలో తన నటనతో అడియన్స్ హృదయాలను దొచుకుంది.

రామ్, సీతా ప్రేమకథకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. ఇందులో మృణాల్ నటన.. లుక్స్ అన్ని తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి.

ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది మృణాల్. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

అందులో న్యాచురల్ స్టార్ హీరో నాని సరసన నటిస్తోన్న హాయ్ నాన్న ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే విడుదలయ్యాయి.

అలాగే ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో మృణాల్ ను ఎంపిక చేసినట్లుగా టాక్ నడిస్తోంది.