Movie Update: బర్త్ డే సందర్భంగా పవన్ వరుస సినిమాల అప్డేట్స్.. లియో సినిమాలో విశాల్ క్యారెక్టర్‌ను కొట్టేసిన అర్జున్..
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా పవన్ వరుస సినిమాల అప్డేట్స్ వచ్చాయి. లియో సినిమాకు నో చెప్పటంపై క్లారిటీ ఇచ్చారు హీరో విశాల్. దేశవ్యాప్తంగా జవాన్ మేనియా గట్టిగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. కాంతార సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రిషబ్ శెట్టికి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. జోదా అక్బర్ లాంటి క్లాసిక్ సినిమాను రూపొందించిన అశుతోష్ గోవరికర్, తన నెక్ట్స్ సినిమాలో రిషబ్‌ను కీ రోల్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు.