
సినిమా ఎలా ఉన్నా.. అదెలా ఉండబోతుందో అని క్యూరియాసిటీ క్రియేట్ చేసేది మాత్రం టైటిలే. అది కరెక్టుగా సెట్ అయిందంటే మాత్రం సినిమాకు బాగా హెల్ప్ అవుతుంది. అదే సమయంలో రెగ్యులర్ టైటిల్స్ కాకుండా కాస్త కొత్తగా ట్రై చేసినా ఆడియన్స్‌లో ఆ సినిమాపై ఆసక్తి రేగుతుంది. ఈ మధ్య అలాంటి భిన్నమైన టైటిల్స్‌తోనే కొన్ని సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూద్దాం..

కొన్నిసార్లు టైటిల్‌తోనే సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతుంది. చిన్న సినిమాలతై మరీనూ.. వాటికి కథతో పాటు టైటిల్ కూడా కీలకమే. అందుకే ఈ మధ్య మేకర్స్ తెలివిగా ఆలోచిస్తున్నారు. టైటిల్‌తోనే ఆసక్తి పెంచేస్తున్నారు. ఈ లిస్టులో తరుణ్ భాస్కర్ ముందే ఉంటారు. తన సినిమాకు కీడా కోలా అనే టైటిల్ పెట్టారు. గతంలోనూ ఈ నగరానికి ఏమైంది అనే టైటిల్‌తో వచ్చారీయన.

అలాగే సుమ కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు బబుల్ గమ్ అనే డిఫెరెంట్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాను రవికాంత్ పారెపు తెరకెక్కిస్తున్నారు. అలాగే సత్యం రాజేష్ హీరోగా నటిస్తున్న సినిమాకు మా ఊరి పొలిమేర అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా సీక్వెల్ ట్రైలర్ కూడా ఇప్పుడు వచ్చింది. ఇక నవీన్, అనుష్క ఇంటిపేర్లతో ఈ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా వచ్చింది.

సంపూర్ణేష్ బాబు సినిమాలకు ఎప్పుడూ డిఫెరెంట్ టైటిల్స్ ఆలోచిస్తుంటారు దర్శకులు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట అలా వచ్చినవే.. ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ అంటూ వస్తున్నారీయన.

మరోవైపు కళ్యాణ్ రామ్ ఆ మధ్య అమిగోస్ అంటూ అర్థమే కాని టైటిల్‌తో వచ్చారు. ఇక బిగ్ బాస్ సోహెల్ మిస్టర్ ప్రగ్నెంట్‌గా వస్తే.. కలర్స్ స్వాతి సినిమాకు మంత్ ఆఫ్ మధు అనే పేరు పెట్టారు.