
దృశ్యం సినిమా తెచ్చుకున్న ఐ బాల్ అటెన్షన్‌ని మలయాళ సినిమాల్లో మరెన్ని రీచ్ కాగలిగాయి అంటే కాసేపు ఆలోచించాల్సి వస్తుందేమో. సినిమా క్లిక్ కావడం వేరు, ఫ్రాంఛైజీ హిట్ కావడం వేరు.. ఆ రేంజ్‌లో రీమేక్ కావడం వేరు. అంతగా జనాలను అట్రాక్ట్ చేసిన సబ్జెక్ట్ దృశ్యం.

ఇప్పుడు దృశ్యం మూవీకి ఆఖరి పార్టును తెరకెక్కిస్తున్నారు. ఇంతకన్నా చెప్పాలనుకుంటే చాలానే చెప్పొచ్చు. కానీ, కొన్ని ఫీలింగ్స్ బావున్నప్పుడే ఫుల్ స్టాప్ పెడితే ఆ ఆనందం వేరుగా ఉంటుందంటున్నారు లాల్ ఏట్టన్. అందుకే దృశ్యం సీక్వెల్‌కి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఫిక్సయిపోయి, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

రీసెంట్గా రిలీజ్ అయిన లూసిఫర్ సీక్వెల్ ఎల్ 2 ఎంపురాన్ విషయంలోనూ ఇదే మాట వినిపిస్తోంది. కరోనా టైమ్‌లో ఓటీటీలో యమాగా రీచ్ అయింది లూసిఫర్ మూవీ. తెలుగులో గాడ్‌ఫాదర్‌గానూ రీమేక్ అయింది.

ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నప్పుడు భలే క్రేజ్ కనిపించింది జనాల్లో. ఈ క్రేజ్‌ని ఇంకా కంటిన్యూ చేస్తారా? చాప్టర్లుగా విస్తరించుకుంటూ పోతారా? అనే మాట మేకర్స్‌కి ఎదురైంది ఈ మూవీ నటీనటులకు, దర్శకనిర్మాతలకు.

పక్కాగా అయితే ఇంకో సినిమా చేయడానికి కావాల్సినంత మెటీరియల్ ఉంది. అంతకు మించి సాగదీయడం వేస్ట్ అనుకుంటున్నామని ఓపెన్ అయ్యారు పృథ్విరాజ్. సో మోహన్‌లాల్ కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్ అనిపించుకున్న ఈ రెండు సబ్జెక్టులకు అతి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోందన్నమాట.