తెలుగు సినిమా అయిన 'ఆర్‌ఆర్‌ఆర్'లోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడంపై భారతీయులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు
పాటల రచయిత చంద్రబోస్ కలం నుంచి జాలు వారిన పాటకు కీరవాణి బాణీలు సమకూర్చగా.. రాహుల్ సింప్లిగంజ్, కాలభైరవ తమ స్వరాలతో ఆ పాటకు ప్రాణం పోశారు.
తాజాగా సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి తండ్రి శివశక్తి దత్తా నాటు నాటు పాటపై చేసిన ఘాటు కామెంట్లు వైలర్ అవుతున్నాయి
కీరవాణికి మూడో ఏట నుంచే సంగీతం నేర్పాను. తన టాలెంట్ చూసి ఎంతో మురిసిపోతుంటాను. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌లో నాటు నాటు పాట నాకు అస్సలు నచ్చలేదు.
అసలు అది కూడా ఓ పాటేనా? దానికిచ్చిన మ్యూజిక్ నాకిష్టంలేదు. సంగీతం ఎక్కడుంది? రాజమౌళి టేస్టు ఎలా ఉంటే కీరవాణి అలా రాస్తాడు. కానీ ఇన్నాళ్లూ కీరవాణి పడ్డకష్టానికి ఈ పాట రూపంలో ఫలితం వచ్చింది. చంద్రబోస్ రాసిన 5 వేల పాటల్లో అసలిది ఓ పాటా? కీరవాణి సమకూర్చిన సంగీతంలో ఇదొకలెక్కా? ఏమాటకామాటే చెప్పాలి. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అద్భుతం. అందునా తారక్, చరణ్ డ్యాన్స్ మహా అద్భుతం. వీళ్లందరి కృషి వల్ల ఆస్కార్ దక్కడం గర్వించదగ్గ విషయం అంటూ భిన్నరీతిలో స్పందించారు.