తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన తమన్నా..
మళ్లీ ఇప్పుడామె కెరీర్ గాడిన పడటమే కాదు.. జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. ప్రస్తుతం తమన్నా చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉండగా.. అందులో ఒకటి పాన్ ఇండియా మూవీ
ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న తమన్నా.. తాజాగా కన్నడలో ఒక పాన్ ఇండియా మూవీకి.. తెలుగులో ఎఫ్3.. చిరుతో ఒక సినిమాలో జత కట్టేందుకు ఓకే చేసింది.
ఇప్పటికైతే తాను పెళ్లి గురించి ఆలోచించటం లేదని.. మరో రెండేళ్ల వరకు మాత్రం పెళ్లి ఆలోచనలు లేవని స్పష్టంచేసింది
రెండేళ్ల తర్వాత కచ్ఛితంగా పెళ్లి గురించి ఆలోచన చేస్తానని చెప్పిన ఆమె.. అప్పటి వరకు నో మ్యారేజ్ అన్న విషయాన్ని తేల్చేసింది.