మిడిల్ ఆర్డర్ లోనే ఫెయిల్ అవుతున్న మీడియం రేంజ్ హీరోలు
వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి.. పోయే సినిమాలు పోతూనే ఉన్నాయి అన్నట్లుంది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి. స్టార్ హీరోలెలాగూ ఇప్పుడు రావట్లేదు.. కనీసం వచ్చిన మీడియం రేంజ్ హీరోలైనా ఆకట్టుకుంటారా అనుకుంటే.. అదీ జరగట్లేదు. క్రికెట్ టీంలో మిడిల్ ఆర్డర్ ఫెయిలైనట్లు.. ఒకరిద్దరు తప్ప అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారిప్పుడు. మరి వాళ్ల దశ తిరిగేదెప్పుడు..? టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా.. మిడిల్ ఆర్డర్ ఆదుకున్నపుడే కదా మ్యాచులు గెలిచేది. అలా కాకుండా అంతా ఒకేసారి చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటి..? టాలీవుడ్ సిచ్యువేషన్ ఇప్పుడలాగే ఉంది.