
త్రికరణ శుద్ధిగా పని చేసుకుంటూ వెళ్తుంటే అవార్డులు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని నమ్ముతారు మెగాస్టార్ చిరంజీవి.

పద్మవిభూషణుడిగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కారాన్ని అందుకున్న వేళ వేదిక మీద మెగాబాస్ మాట్లాడిన మాటలను మళ్లీ మళ్లీ నెమరు వేసుకుంటున్నారు అభిమానులు.

బాసూ వేర్ ఈజ్ ద పార్టీ అని ప్రత్యేకించి ఎవరూ అడగనక్కర్లేకుండా, తన సక్సెస్‌తో, సత్కారాలతో అభిమానుల కడుపు నిండేలా ఆనందం పంచుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు సత్కారాలు అంటూ బాస్ వేరే లెవల్ బిజీగా ఉన్నారు. వేదిక మీద చిరు నోట నంది అవార్డుల మాట, గద్దర్ అవార్డుల ప్రస్తావన విన్న తోటి కళాకారుల ఆనందానికి అవధుల్లేవు.

ఇండస్ట్రీ పెద్దగా అవార్డులు కళాకారులను ఎలా ప్రోత్సహిస్తాయో, మెగాస్టార్ చెప్పడం సందర్భోచితం అనే టాక్ వినిపిస్తోంది. పద్మవిభూషణుడి గౌరవాన్ని పొందిన చిరు, అదే ఉత్సాహంతో విశ్వంభర సినిమా కోసం చేసిన కసరత్తులను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.

నిర్విరామంగా ప్రశంసలు అందుతూనే ఉన్నా, తన బాధ్యతను, విశ్వంభర కోసం చేయాల్సిన కృషిని మర్చిపోలేదు మా బాస్ అంటున్నారు.

మెగాహ్యాపీడేస్‌ని చూస్తుంటే, పండగ ముందే వచ్చినట్టుందని ఉప్పొంగిపోతున్నారు. వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతికి సెట్స్ మీదకు రానుంది.