
రిలీజ్ డేట్ కూడా లాక్ అవ్వటంతో గేమ్ చేంజర్ సినిమాకు సంబందించిన అప్‌డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

డిసెంబర్ 29న రామ్ చరణ్ బిగ్గెస్ట్ కటౌట్ లాంఛ్ జరగనుంది. విజయవాడలో 256 ఫీట్లతో కటౌట్ ఏర్పాటు చేసారు. దీనికి ముఖ్య అతిథిగా తమన్ వెళ్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ ఆయన ఎందుకు చేయాలనుకున్నారో.. ఆయన మాటల్లోనే విన్నవారు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గేమ్‌చేంజర్ ఈవెంట్ స్టేజ్ మీద కియారా, అంజలి, ఎస్‌జె సూర్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

అలాగే హైదరాబాద్‌లో త్వరలోనే ఓ ఈవెంట్ ఉండబోతుంది. ఈ వేడుకకు చిరంజీవి వస్తారని తెలుస్తుంది. దాంతో పాటు జనవరి 4 లేదా 5 తేదీల్లో ఏపీలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.

గతంలో రంగస్థలం విజయోత్సవానికి పవన్ వచ్చారు. అప్పట్లో నాయక్ వేడుకలోనూ కనిపించారు. మళ్లీ బాబాయ్ అబ్బాయి కలిస్తే అభిమానులకు ఫుల్ మీల్స్ పక్కా.

గేమ్ చేంజర్‌లో రామ్ ఇంతకీ ఎవరు? అతని చర్యలకు అందరూ అంతలా అవాక్కు కావాల్సిన అవసరం ఏంటో తెలియాలంటే జనవరి 10 దాకా వెయిట్ చేయాల్సిందే.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే చరణ్ లుక్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. 80 పీరియడ్ పొలిటీషియన్‌లా పంచెకట్టులో కనిపించారు చరణ్. ఇలా ఒక్క సినిమాలోనే నాలుగైదు లుక్స్‌తో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు మెగా పవర్ స్టార్.