ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?

Edited By:

Updated on: Jan 21, 2026 | 8:22 AM

రామ్‌ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గేమ్ చేంజర్‌ లాంటి డిజాస్టర్ తరువాత చేస్తున్న సినిమా కావటంతో చరణ్‌ కూడా చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు.

1 / 5
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. ఈయన rrr సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేశారు. తర్వాత గేమ్ ఛేంజర్ మూవీతో వచ్చి తన అభిమానులను నిరాశ పరిచారనే చెప్పాలి.

2 / 5
దీంతో మెగా అభిమానులు అందరూ చెర్రీ పెద్ది సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా చిరు మన శివ శంకర వర ప్రసాద్ మూవీ తర్వాత చెర్రీ కూడా బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నాడంటూ నెట్టింట రచ్చ ర్చచేస్తున్నారు. మరి రామ్ చరణ్ అభిమానులను మెప్పిస్తాడో లేదో చూడాలి.

3 / 5
గేమ్ చేంజర్‌ తరువాత మెగా అభిమానులు ఢీలా పడిపోయారు. చరణ్‌ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చెర్రీ కూడా సోలోగా బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాతో సిద్ధం మవుతున్నారు.

4 / 5
రంగస్థలం తరువాత మరోసారి మాస్‌ విలేజ్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు చెర్రీ. అంతేకాదు ఆట కూలీ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం చేయబోతున్నారు. అందుకే వింటేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందుతున్న పెద్ది తన కెరీర్‌లోనే ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ అన్నారు చరణ్‌.

5 / 5
ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్‌ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేసింది. ప్యారలల్‌గా పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లు సినిమాను మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ సినిమా చరణ్‌ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్‌.