
చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ఆల్రెడీ సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఈ భామ.. ఇప్పుడు వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తూ కెరీర్‌లో స్పీడు పెంచారు.

గుంటూరు కారం సినిమాలో కీలక పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసినా... ఇప్పుడు టాప్ హీరోలతో జోడి కడుతూ స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ప్రజెంట్ టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్నారు మీనాక్షి చౌదరి. ఆల్రెడీ రవితేజ లాంటి సీనియర్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ, వరుసగా సీనియర్ స్టార్స్‌తో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభరలో కీ రోల్‌లో నటిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్‌కు జోడీగా కనిపించబోతున్నారు.

తాజాగా మరో సీనియర్ హీరో బాలయ్య సినిమాకు కూడా మీనాక్షి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అఖండ 2లో మీనాక్షి చౌదరి ఒక హీరోయిన్‌గా కనిపించబోతున్నారట.

ఈ ఇయర్ ఆరు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరి.. మూడు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఈ లక్కీ బ్యూటీని తమ సినిమాలో కాస్ట్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.