Meenakshi Chaudhary : స్టార్ హీరోతో డేటింగ్.. పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి చౌదరి..

Updated on: Jan 06, 2026 | 1:32 PM

మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో విపరీతమైన డిమాండ్ ఉన్న హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. గతేడాది ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండిపోయింది. తాజాగా తన పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

1 / 5
తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు మీనాక్షి చౌదరి. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ హీరోయిన్లలో ఆమె ఒకరు. గతేడాది సంక్రాంతి పండక్కి వెంకీతో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు ఈసారి పండక్కి మరోసారి సందడి చేయనుంది.

2 / 5
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన అనగనగా ఒక రాజు చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా వరుస ప్రమోషన్లలో పాల్గొంటూ ఇంటర్వ్యూలు ఇస్తుంది మీనాక్షి చౌదరి.

3 / 5
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి.. తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించింది. లక్కీ భాస్కర్ సినిమా తర్వాత తల్లి పాత్రలు చేయడానికి తనకు ఆసక్తి లేదని వస్తున్న రూమర్స్ నిజమేనా అడగ్గా.. రూమర్స్ ఎలా వస్తాయో తెలియదని అన్నారు.

4 / 5
అలాంటి కామెంట్స్ తాను ఎక్కడా చేయలేదని.. కథ, పాత్రకు మాత్రమే తాను ప్రాధాన్యమిస్తానని.. కథ బాగుంటే ఎలాంటి పాత్రలోనైనా చేస్తానని అన్నారు. అలాగే తాను ఓ హీరోతో ప్రేమలో ఉన్నానని.. పెళ్లి చేసుకుంటానని వార్తలు వచ్చాయని అన్నారు.

5 / 5
 అలాంటి రూమర్స్ విని తాను అలసిపోయానని.. వాటిలో నిజం లేదని.. ఇప్పుడే పెళ్లి చేసుకోవడం తనకు అసలు ఇష్టమే లేదని అన్నారు మీనాక్షి. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.