
రేసు అంటే ఎప్పుడూ ఒక్కరే ముందుండరు. ఓసారి ఒకరు ఫస్ట్ వస్తే, ఇంకోసారి ఇంకొకరు ట్రాక్‌లో ఉంటారు. ఇది జస్ట్ రేసు విషయంలోనే కాదు.. సినిమా ఇండస్ట్రీకి కూడా వంద శాతం సూటవుతుంది. మరీ ముఖ్యంగా గ్లామర్ రేస్‌లో ఎవరు ముందున్నారు? ఎవరు వెనకబడ్డారనే లెక్కలు ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటారు. ఇంతకీ లాస్ట్ ఇయర్‌కీ, ఈ ఏడాదికి ఏంటి మార్పు?

లాస్ట్ ఇయర్ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదు. అరే... పండక్కి సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. అందులో శ్రీలీల పేరు వినిపించేది. ప్రమోషన్లలో ఆమె ఫొటో కనిపించేది. అంతగా మెస్మరైజ్ చేశారు శ్రీలీల. ఈ ఏడాది కూడా ఆమె గుంటూరు కారంతో దుమ్మరేపారు. త్వరలో పుష్ప2లో స్టెప్పులేయడానికి సిద్ధమవుతున్నారు. లాస్ట్ ఇయర్ ఈ భగవంత్ కేసరి బేబీ చేసిన హల్‌చల్‌తో పోలిస్తే ఈ ఏడాది కాస్త డల్ అయినట్టే లెక్క.

2024 గ్లామర్ లీగ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేశారు మీనాక్షి చౌదరి. గుంటూరు కారం సినిమాతో స్టార్ట్ చేసిన ఇన్నింగ్స్ ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సినిమా హాల్లో సినిమాలు మారుతున్నాయి. వాటిలో హీరోలు మారుతున్నారు.

కానీ హీరోయిన్‌గా మాత్రం మీనాక్షి చౌదరి కంటిన్యూ అవుతూనే ఉన్నారంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు జనాలు. దీపావళికి రిలీజ్ అయిన లక్కీ భాస్కర్‌తోనో, ఈ వారం రిలీజ్ అయిన మట్కాతోనో కంప్లీట్ కావడం లేదు మీనాక్షి 2024 రిలీజుల లిస్టు.

విశ్వక్సేన్‌తో చేసిన మెకానిక్ రాకీ సినిమాను అలా ఎలా మర్చిపోతారూ... కచ్చితంగా చూసేయండి అంటూ ఇష్టంగా చెబుతన్నారు ఈ లేడీ. సో.. నెక్స్ట్ ఇయర్ ఈ ఇన్నింగ్స్ ని శ్రీలీలగానీ, మీనాక్షిగానీ కంటిన్యూ చేస్తారా? లేకుంటే ఇంకెవరైనా టాప్ పొజిషన్‌ని ఆక్యుపై చేస్తారా? అంటూ ఇంట్రస్ట్ గట్టిగానే క్రియేట్ అవుతోంది.