Pushpa2:  ‘పుష్ప 2’.. రెడీ అవుతున్న ఊ అంటూ ఊగిపోయే పాటలు..

| Edited By: Phani CH

Dec 04, 2023 | 2:45 PM

రాఘవేంద్రరావు సినిమాల్లో పాటలకు ఎంత స్పెషాలిటీ ఉంటుందో, కృష్ణవంశీ సినిమాల్లోని పాటలకోసం జనాలు ఎలా వెయిట్‌ చేసేవారో, ఇప్పటి ట్రెండ్‌లో సుకుమార్‌ సినిమాల్లో సాంగ్స్ కోసం కూడా యూత్‌ అంతే ఈగర్‌గా వేచి చూస్తున్నారు. సుకుమార్‌ ఎంత మంది హీరోలతో సినిమాలు చేసినా, అల్లు అర్జున్‌తో మూవీ అనేసరికి ఏదో తెలియని ఎనర్జీతో కనిపిస్తుంటారు. ఆర్య, ఆర్య2లోని సన్నివేశాలు చూసినవారు, అందులోని పాటలు విన్నవారు ఎవరైనా సరే... ఈ మాట నిజం అని తీరుతారంతే.

1 / 5
బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్‌ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప నార్త్ ఆడియన్స్‌ను కూడా ఎట్రాక్ట్ చేసింది. దీంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా బిగ్ కాన్వస్‌ను సిద్ధం చేస్తోంది పుష్ప రాజ్‌ టీమ్.

2 / 5
అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా మార్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయటమే కాదు, నార్త్ ఆడియన్స్‌కు సౌత్ మాస్ కంటెంట్ సత్తా ఏంటో చూపించింది.

3 / 5
ఆర్య, ఆర్య2లో అల్లు అర్జున్‌లోని స్టైల్‌ని ఎలివేట్‌ చేసిన సుకుమార్‌ పుష్పలో బన్నీలోని ఊరమాస్‌ అవతార్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. కేరక్టరైజేషన్‌లో మాత్రమే కాదు, పాటలు కూడా ఉరమాస్‌ జనాలకు రీచ్‌ అయ్యాయంటేనే అర్థం చేసుకోవచ్చు.

4 / 5
పుష్ప సినిమా చూశాక, ఇప్పుడు పుష్ప2లోనూ పాటలు అసలు తగ్గేదేలే అన్నట్టు ఉంటాయని ఫిక్సయిపోయారు జనాలు.  ఆల్రెడీ దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు, చంద్రబోస్‌ సాహిత్యం జోడై పాటలు సిద్ధమైపోయాయి. రీసెంట్‌గా జాతర సాంగ్‌ షూట్‌ చేశారు. మిగిలిన పాటలకు స్టెప్పులు కంపోజ్‌ చేసే బాధ్యత తీసుకున్నారు జానీ మాస్టర్‌.

5 / 5
మాస్టర్‌ మైండ్‌ ఫిల్మ్ మేకర్‌ ఆర్యసుక్కును కలిశాను. ఎనర్జిటిక్‌గా, మోటివేటింగ్‌గా అనిపించిందంటూ జానీ మాస్టర్‌ ఇచ్చిన హింట్‌ అల్లు ఆర్మీని ఊపేస్తోంది. జయాపజయాల గురించి, జీవితం గురించి సకుమార్‌తో మాట్లాడుతుంటే ఉత్సాహంగా అనిపించిందంటూ జానీ చెప్పిన మాటలు వైరల్‌ అవుతున్నాయి. సో.. పుష్ప2లో అందరూ ఊ అంటూ ఊగిపోయే పాటలు రెడీ అవుతున్నాయన్నమాట.