
ఆకాంక్ష సింగ్ కేవలం నటి మాత్రమే కాదు.. గాయని, రచయిత్రి, ఫిజియోథెరపిస్ట్ కూడా... ఈ ముద్దుగుమ్మ రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించింది. నాటక రంగంలో కెరీర్‌ను ప్రారంభించి, సుమారు పది నాటకాలలో నటించింది. ఆమె తల్లి కూడా నాటక నటి.

ఆకాంక్ష 2012లో "నా బోలె తుం నా మైనే కుచ్ కహా" హిందీ ధారావాహికలో విధవ తల్లిగా నటించి తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత "గుల్మొహర్ గ్రాండ్"లో కీలక పాత్రలో కనిపించింది. 2022లో "రంగ్‌బాజ్: డర్ కీ రాజనీతి" , "మీట్ క్యూట్" వంటి ధారావాహికలలో నటించింది.

2017లో హిందీ చిత్రం "బద్రీనాథ్ కీ దుల్హనియా"తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది తెలుగు చిత్రం "మళ్ళీ రావా"లో కథానాయకిగా నటించింది. ఈ సినిమాకు ఆమె SIIMA అవార్డు నామినేషన్ అందుకుంది. అలాగే నాగార్జున నాని నటించిన "దేవదాస్" , "పైల్వాన్" (2019, కన్నడ), "క్లాప్" (2022, తమిళ), "రన్‌వే 34" (2022, హిందీ) వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో "పరంపర" వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందింది.

ఆకాంక్ష ఫిజియోథెరపీలో విద్యను అభ్యసించింది. ఆమె చిన్ననాటి స్నేహితుడు కునాల్ సైన్‌ను వివాహం చేసుకుంది. ఆకాంక్ష సింగ్ గురించి 2022 తర్వాత కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయలేదు. అయితే, ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్యూటీ ట్రెడిషనల్ డ్రస్ లో అదరగొట్టింది. నెటిజన్స్ ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.