
ధనుష్, సూర్య తమిళ చిత్రపరిశ్రమలో బిజీ హీరోలు. ఇద్దరు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు. కానీ ఈ ఇద్దరు హీరోల సినిమాల్లో ఇప్పుడు 23 ఏళ్ల కుర్ర హీరోయిన్ నటించేందుకు రెడీ అయినట్లు సమాచారం.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మమితా బైజు. మలయాళీ చిత్రపరిశ్రమలో చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే ప్రేమలు సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఊహించని రెస్పాన్స్ అందుకుంది ఈ వయ్యారి.

దీంతో ఆమెకు తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ తన వద్దకు వచ్చిన క్రేజీ ఆఫర్లను రిజెక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మమితా బైజుకు తమిళంలో వరుసగా 2 జాక్ పాట్ అవకాశాలు వచ్చాయి. రెండు సినిమాల్లో ఆమె ప్రధాన పాత్ర.

సూర్య హీరోగా, డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్న సినిమాలో ముందుగా మమిత బైజును ఎంపిక చేశారట. ఈ సినిమాలో సూర్య సరసన మమితా కనిపించనుందని అంటున్నారు.

అలాగే ధనుష్ హీరోగా రాబోతున్న కొత్త ప్రాజెక్టులోనూ ఈ ముద్దుగుమ్మను సెలక్ట్ చేశారని సమాచారం. ప్రస్తుతం తమిళంలో విజయ్ దళపతి నటిస్తోన్న జననాయకన్ సినిమాలో నటిస్తుంది మమితా.