
కెరీర్ ఫుల్ ఫామ్‌లో లేకపోయినా.. సినిమాల సెలక్షన్ విషయంలో మాత్రం పర్టిక్యూలర్‌గా ఉంటున్నారు కొంత మంది బ్యూటీస్. రాశీ కన్నా వాసి గొప్పది అన్నట్టుగా కంటెంట్ నుంచి క్యారెక్టర్ వరకు అన్నీ పక్కాగా ఒకే అనుకుంటునే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఎవరా బ్యూటీస్ అనుకుంటున్నారా. సౌత్ నుంచి గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీ శోభితా ధూళిపాల.

మిస్ ఇండియా క్రౌన్ సాధించి బాలీవుడ్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసిన శోభితా ధూళిపాల, వెండితెర మీద అనుకున్న స్థాయి అవకాశాలు సాధించలేకపోతున్నారు.

ఇంట్రస్టింగ్ మూవీస్ చేస్తున్నా.. ఫుల్ బిజీ అన్న రేంజ్‌లో అయితే కెరీర్ సాగటం లేదు. క్యారెక్టర్ సెలక్షన్ విషయంలో మరీ పర్టిక్యులర్‌గా ఉండటం వల్లే శోభితా బిజీ హీరోయిన్ అనిపించుకోలేకపోతున్నారన్నది బీ టౌన్ టాక్. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేసే ఛాన్స్ ఉన్నా.. సంథింగ్ స్పెషల్ ఉంటేనే ఆ క్యారెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు శోభితా.

రీసెంట్ ఇంటర్వ్యూలో శోభిత కూడా ఇదే విషయం చెప్పారు. నటిగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్న రోల్స్ మాత్రమే చేయాలనుకుంటున్నా, అందుకే కొద్ది రోజులుగా ఏ ప్రాజెక్ట్స్‌కు సైన్ చేయలేదన్నారు. మరో సౌత్ బ్యూటీ మాళవిక మోహనన్ కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.

సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తవుతున్నా ఇంకా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయారు మాళవిక. ఈ పరిస్థితుల్లోనూ క్యారెక్టర్ నచ్చితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటూ గట్టిగా చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్లే మాళవిక కెరీర్ స్పీడందుకోలేదన్నది విశ్లేషకుల మాట.