Mahesh Babu Fans: సోషల్ మీడియాలో జక్కన్నకి మహేష్ ఫాన్స్ రిక్వస్టులు.. ఏమి అడుగుతున్నారంటే..

| Edited By: Prudvi Battula

Nov 30, 2023 | 12:47 PM

ఎవరు ఎవరితో సినిమా చేయాలన్నది కథ డిమాండ్‌ చేయాలి. కాంబినేషన్లు ఆ తర్వాతే కుదరాలి. అయితే సోషల్‌ మీడియాలో ఇందుకు అతీతంగా ఓ కల్చర్‌ కనిపిస్తోంది. హీరో, డైరక్టర్‌ కాంబినేషన్‌ కుదిరిందని తెలియగానే, హీరోయిన్‌ ఫలానా అయితే బావుంటుందంటూ సజెషన్స్ అందుతున్నాయి. అలా ఇప్పుడు రాజమౌళికి నాన్‌స్టాప్‌గా రిక్వస్టులు అందుతున్నాయి. అదీ... మహేష్‌ మూవీ విషయంలో!

1 / 5
ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత మరే సినిమా చేయలేదు రాజమౌళి. ఆయన ఫోకస్‌ మొత్తం మహేష్‌ సినిమా మీదే ఉంది. అడ్వెంచరస్‌ మూవీగా తెరకెక్కించడానికి అన్నీరకాలుగా రెడీ అవుతున్నారు జక్కన్న. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

2 / 5
అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరన్నది ఇప్పటిదాకా ఫైనల్‌ కాలేదు. దేవర ఓపెనింగ్‌లో రాజమౌళితో జాన్వీ కపూర్‌ ఈక్వేషన్‌ చూసిన వారిలో మాత్రం మహేష్‌ మూవీకి ఆమెనే ఫిక్స్ చేస్తారా అనే అనుమానాలు కనిపించాయి.

3 / 5
అయితే అలాంటిదేమీ లేదని యూనిట్‌ వైపు నుంచి వినిపించింది. ఇప్పుడైతే మహేష్‌ సినిమాలో హీరోయిన్‌గా ఆలియా ఉంటే బావుంటుందంటూ రిక్వెస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఆల్రెడీ ట్రిపుల్‌ ఆర్‌లో రాజమౌళితో పనిచేశారు ఆలియా. ఆమె స్క్రీన్‌ మీద కనిపించింది కొద్దిసేపే అయినా, వరల్డ్ వైడ్‌ ఆడియన్స్ మెప్పు పొందారు. ఆ కాసేపటికే అంత ఇంపాక్ట్ ఉంటే, ఓవరాల్‌ సినిమాలో ఆలియా హీరోయిన్‌ అయితే, స్క్రీన్‌ దద్దరిల్లిపోతుందన్నది ఫ్యాన్స్ మాట.

4 / 5
ప్రస్తుతం మహేష్‌ గుంటూరు కారం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఓ వైపు షూటింగ్‌, మరోవైపు డబ్బింగ్‌ పనులతో హడావిడిగా ఉన్నారు. డిసెంబర్‌ ఫస్ట్ హాఫ్‌లో ఈ పనులన్నీ పూర్తిచేసేయాలన్నది సూపర్‌స్టార్‌ ప్లాన్‌. ఆ తర్వాత ఇయర్‌ ఎండ్‌కి ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లొచ్చి గుంటూరు కారం రిలీజ్‌ ప్రమోషన్లలో పాల్గొంటారన్నది ఘట్టమనేని కాంపౌండ్‌ వార్త.

5 / 5
గుంటూరు కారం పనులన్నీ పూర్తయ్యాక రాజమౌళి సినిమా మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తారు మహేష్‌. ఆ టైమ్‌కి ఆలియా కూడా తన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటారట. సో ఈ కాంబినేషన్‌ అయితే, ఇంటర్నేషనల్‌ లెవల్లో అద్దిరిపోతుందంటున్నారు అభిమానులు. ఇంతకీ రాజమౌళి మనసులో ఏముంది? వీరిద్దరినీ జత కలుపుతారా?