
ఇద్దరికీ ఈ ఇయర్ చాలా చాలా కీలకం. ఆ ఇద్దరు స్టార్లకీ అంత ముఖ్యమైన విషయాలు ఏం ఉన్నాయి ఈ ఏడాదిలో.? రీజినల్ కుర్చీ మడతపెట్టి, ఇంటర్నేషనల్ కంఫర్ట్ సీటింగ్‌కి షిఫ్ట్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు.

ఇకపై మాత్రం సీన్ ఇంకోలా ఉండబోతోందని చెప్పకనే చెప్పేస్తున్నారు జక్కన్న. రాజమౌళి ఇచ్చిన సలహాలను తూ.చా తప్పకుండా పాటిస్తున్నారు మహేష్. ఆయన సరిహద్దుల్ని చెరిపేసి ప్యాన్ ఇండియా ప్రయాణం ప్రారంభిస్తున్నది 2024లోనే.

ఓ వైపు యాడ్స్ చేయడం, ఇంకో వైపు ఆర్టిస్టుగా సైన్ చేయడం, రీసెంట్‌గా డ్యాన్స్ చేయడం.. ఎన్ని చేయగలరో.. అన్నిటినీ చేసేస్తున్నారు.

మహేష్ సినిమా స్టార్ట్ అయ్యాక...ఇన్నిటికి టైమ్ కేటాయించలేమన్నది రాజమౌళి నమ్ముతున్న విషయం. జక్కన్న పల్స్ ని ఆల్రెడీ పట్టేసుకున్నారు సూపర్‌స్టార్ మహేష్.

అందుకే గుంటూరు కారం తర్వాత ఆయన కంప్లీట్‌గా ప్రైవేట్ స్పేస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఓ వైపు రాజమౌళి ప్రాజెక్టుకు ప్రిపేర్ అవుతూనే.. ఇంకో వైపు ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్‌ని స్పెండ్ చేస్తున్నారు.

ల్యాంగ్ హెయిర్‌తో మేకోవర్ కావడం, స్కేటింగ్ క్లాసెస్, ఫిట్‌నెస్ కోచింగ్‌కి అటెండ్ అవ్వడం... ఇలా ఒకటా, రెండా? అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టు అన్ని విధాలా తనని తాను సిద్ధం చేసుకుంటున్నారు సూపర్ స్టార్. ఇన్నాళ్లూ ఒక ఎత్తు. అంతా టాలీవుడ్‌లోనే జరిగింది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్ మాత్రం.. జూన్ తర్వాతే ఉంటుందన్నది ఫిల్మ్ నగర్ మాట. అంటే, అప్పటిదాకా హీరో అండ్ కెప్టెన్.. ఇద్దరికీ పెయిడ్ హాలిడేసే అన్నమాట.