అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది లావణ్య త్రిపాఠి. నాకు పెళ్లి చేసేయండి నాన్న అంటూ ఆ సినిమాలో క్యూట్ గా డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్న లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంది.
నేచురల్ స్టార్ నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రాణించింది ఈ భామ .
ఆతర్వాత ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో హిట్స్ దక్కలేదు. ఇక ఇప్పుడు పెళ్లిపీటలెక్కడానికి రెడీ అవుతుంది. మెగా హీరో వరుణ్ తేజ్ తో ఈ ముద్దుగుమ్మ లవ్వాయణం నడిపించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు దాదాపు 7 ఏళ్ల నుంచి సీక్రెట్ గా ప్రేమించుకుంటున్నారు.
మొత్తానికి తమ రిలేషన్ ను ఒప్పుకున్నారు ఈ జంట. జూన్ 9న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, బందు మిత్రుల మధ్యనే ఈ వేడుక జరిగింది. త్వరలోనే గ్రాండ్ గా వెడ్డింగ్ జరుపుకోనున్నారు. ఇందుకోసం ఇరు కుటుంబాలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక లావణ్య ప్రస్తుతం సినిమాలు తగ్గించేసింది. ఆమె నుంచి కొత్త సినిమా ఏది అనౌన్స్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. నిత్యం ఎదో ఒక ఫోటో షూట్స్ తో అభిమానులను పలకరిస్తూనే ఉంది లావణ్య.
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలో లావణ్య యువరాణిగా మెరిసిపోయింది. నెట్టింట లావణ్య లేటెస్ట్ ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలకు కుర్రాకారు ఫిదా అవుతున్నారు.