
లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ నయనతార. తన సినిమాలతో పాటు వ్యక్తిత్వంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది.

నయనతార తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఇటీవలే బాలీవుడ్ లో సినిమా చేసింది నయన్.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది నయనతార.

ఇక నయన్ దర్శకుడు విగ్నేషన్ శివన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

తెలుగు, తమిళ్, హిందీలోనూ సినిమాలు చేస్తోంది నయనతార. ఇటీవలే జవాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది నయనతార. తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.