
తెలుగులో తనకు ఓ సినిమా డైరక్ట్ చేయాలని ఉందని, అది కూడా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కించాలని ఉందనీ ఓపెన్ అయ్యారు ధనుష్.

తమిళ్‌లో తాను 51 సినిమాలు చేసినా, కుబేర తనకు తెలుగులో రెండో సినిమానే అని వినమ్రంగా చెప్పారీ స్టార్. కుబేర ఆడియో వేడుకలో ధనుష్ చెప్పిన మాటలు విన్నవారందరి దృష్టీ పవన్ కల్యాణ్ ఫిల్మోగ్రఫీ మీదకు మళ్లుతోంది.

ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాలను చకాచకా పూర్తి చేసి, కంప్లీట్‌గా పాలన మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు పవర్‌స్టార్ అనేది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. అందుకే ఈ మధ్య హరిహరవీరమల్లుని కంప్లీట్ చేశారు.

ఓజీకి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఉస్తాద్ భగత్‌సింగ్‌ని లైన్లో పెట్టారు. ఇక కమిట్ అయిన సినిమాల్లో సురేందర్ రెడ్డికి మాత్రం కాల్షీట్ ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలోనే ధనుష్ మాటలు పవర్‌స్టార్ లైనప్ మీద ఇంట్రస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

ఒకవేళ ధనుష్ చెప్పే లైన్ పవర్‌స్టార్‌కి నచ్చితే కాల్షీట్ పక్కాగా ఇచ్చేస్తారా? అనేది మరో డిస్కషన్. ఆల్రెడీ తనకు ధనుష్ డైరక్షన్‌లో సినిమా చేయాలని ఉందని ఓపెన్‌గానే చెప్పేశారు కింగ్ నాగార్జున. సో, ధనుష్ టైమ్ తీసుకుని కెప్టెన్ కుర్చీలో కూర్చోవాలనుకోవాలేగానీ, స్టార్ హీరోలతో కొలాబరేషన్ ఈజీగానే ఉంటుందన్నమాట.