ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ పుట్టిన రోజు నేడు (జూలై 27). ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్‌లో జానకిగా మెప్పించిన ఆమెకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కృతి సనన్ 27 జూలై 1990న జన్మించింది. పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన ఆమె ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది.
2014లో విడుదలైన మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే' కృతి మొదటి సినిమా. ఆ తర్వాత నాగచైతన్యతో దోచేయ్ అనే సినిమాలోనూ నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడే సెటిలైంది.
'బరేలీ కి బర్ఫీ', 'లుకా చుప్పి', 'హౌస్‌ఫుల్ 4' 'మిమీ' వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలతో పాటు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది కృతి.
టైటాన్ వంటి టాప్ రేటెడ్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఇందు కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. కృతి సనన్ నికర ఆస్తుల విలువ రూ.74 కోట్లని తెలుస్తోంది.
అలాగే ఆడి క్యూ7, బెంజ్ ఇ-క్లాస్, బీఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ వంటి పలు లగ్జరీ కార్లు కృతి గ్యారేజ్‌లో ఉన్నాయి. వీటితో పాటు ముంబైలోని జుహులో కృతికి లగ్జరీ హౌస్ ఉంది.