
తెలుగుతో పాటు కన్నడ, హిందీ వంటి భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ నటి కృతి కరబంధ తన జీవితంలో నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తన ప్రియుడు పుల్కిత్ సామ్రాట్ తో కలిసి ఏడడుగులు వేసింది. వివాహ వేడుక అనంతరం తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారీ న్యూ కపుల్.

ఢిల్లీలోని ఐటీసీ గ్రాండ్ భారత్‌లో కృతి, పుల్ కిత్ సామ్రాట్ ల వివాహం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. ఈ వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

కృతి, పుల్కిత్ ఇద్దరూ ఢిల్లీకి చెందినవారు. అందుకే వీరి పెళ్లి వేడుక ఢిల్లీలోనే జరిగింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ కృతి ఎమోషనల్ అయ్యింది.

కృతి, పుల్కిత్ 'పాగల్‌పంటి' సెట్స్‌లో మొదటి సారిగా కలుసుకున్నారు. ఈ ఏడాది మొదట్లో వీరి నిశ్చితార్థం చేసుకున్నారు.

కృతి కర్బందా 2009లో తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించింది. తెలుగులో పవన్ కల్యాణ్ తీన్ మార్, మనోజ్ మిస్టర్ నూకయ్య, అలాగే రామ్ పోతినేని ఒంగోలు గిత్త సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ సోదరిగానూ అలరించింది.