
టాలీవుడ్ అడియన్స్ బేబమ్మ కృతిశెట్టి. తెలుగు సినీ పరిశ్రమలోకి ఉప్పెనలా దూసుకువచ్చింది కృతి. తొలి చిత్రం విడుదలకు ముందే ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంది.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు సినిమాలతో సక్సెస్ అందుకుంది.

కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. తెలుగులో కృతికి అవకాశాలు రావడం లేదు. చివరిగా కస్టడీ చిత్రంలో నటించింది కృతి.

ప్రస్తుతం శర్వానంద్ జోడిగా ఓ ప్రాజెక్టులో నటిస్తుంది. అలాగే మలయాళంలో పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తుంది. ఇవే కాకుండా తమిళంలో ఓ మూవీలో కనిపించనుంది.

లవ్ టుడే సినిమా హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన నటిస్తుంది కృతి. ఈ చిత్రానికి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో సైలెంట్ అయిన కృతి.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ట్రెండీ గ్లామర్ లుక్స్‌తో కట్టిపడేస్తుంది బేబమ్మ.