
మీ అందరికీ శ్రీ కృష్ణ జన్మదిన శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ రోజు ఆనందం, ఉల్లాసం, శ్రేయస్సును తేవాలంటూ మహేష్ బాబు ట్వీట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.

పూజా హెగ్డే తన రాబోయే చిత్రం రాధే శ్యామ్‌లోని కొత్త పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు .. మేము జన్మాష్టమిని జరుపుకుంటున్నాము.. విక్రమాదిత్య , ప్రేర్ణలు మీకు ప్రేమ యొక్క కొత్త అర్థాన్ని నేర్పించనివ్వండి.. అంటూ అభిమానులకు 'హ్యాపీ జన్మాష్టమి' శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా కాజల్ అగర్వాల్ రాధా కృష్ణ విగ్రహంతో ఉన్న ఓ అద్భుతమైన ఫోటోను షేర్ చేసింద. ఫోటోలో రాధా కృష్ణుల విగ్రహంతో పాటు కాజల్ కూడా చాలా అందంగా ఉంది.

రకుల్ ప్రీత్ సింగ్ శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. తెలుపు, బంగారు దుస్తుల్లో అందంగా కనిపిస్తున్న ఫోటోను షేర్ చేసింది.

దివంగత కన్నడ నటుడు చిరంజీవి సర్జా భార్య, నటి మేఘన రాజ్ 2021 కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పారు. తమ కుమారుడు జూనియర్ చిరుతో ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.