
రెండు దశాబ్దాలుగా దక్షిణ వెండితెరపై తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది అందాల తార త్రిష. అంతే కాదు తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. చాలా మంది కొత్త నటీమణులు వచ్చినప్పటికీ, త్రిష క్రేజ్ తగ్గలేదు.

త్రిష తన గ్లామర్, నటనకు మాత్రమే కాకుండా, సంపాదన పరంగా కూడా అగ్రస్థానానికి చేరుకుంటోంది. ఈ అందాల రాణి ఆస్తులు , విలాసవంతమైన జీవనశైలి విలువ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

1999 నుండి చిత్ర పరిశ్రమలో విజయం సాధించిన త్రిష, ఆస్తుల పరంగా కూడా తెలివైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆమె మొత్తం ఆస్తులు దాదాపు రూ. 85 కోట్లు ఉన్నట్లు సమాచారం.

ముఖ్యంగా బ్లాక్ బస్టర్ "పొన్నియిన్ సెల్వన్" తర్వాత, ఆమె తన పారితోషికాన్ని భారీగా పెంచుకుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, త్రిష ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ. 5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.

ఆమె కార్ల జాబితాలో దాదాపు రూ. 80 లక్షల విలువైన మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్, రూ. 75 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్, రూ. 60 లక్షల విలువైన రేంజ్ రోవర్ ఎవో, రూ. 63 లక్షల విలువైన మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్ ఉన్నాయి.