
ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. నటిగా తనకంటూ ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ ఎంబీఏను పూర్తి చేయాలనుకుందంట. అందుకోసం IIM లో చేరాలని ఎన్నో కలలు కన్నదట. ముంబైలోని KC కాలేజీ నుంచి మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ లో స్పెషలైజే,న్ తో మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ చేసింది.

అయితే కాలేజీలో ఉండగానే ఆమెకు నటనపై ఆసక్తి ఏర్పడిందట. దీంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. కళ్యాణ్ రామ్ జోడిగా లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో నటిగా గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత చందమామ సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత కాజల్ కు తెలుగులో మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగు, తమిళంలో స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది.

తెలుగులో ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుందట. కాజల్ ఆస్తుల విలువ దాదాపు రూ.83 కోట్లు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది.